Site icon HashtagU Telugu

Runamafi : సీఎం రేవంత్ రెడ్డి చిట్​చాట్ కాదు, చీట్ ​చాట్ – హరీష్ రావు

Harishrao Savel Revanth

Harishrao Savel Revanth

రుణమాఫీ (Runamafi ) ఫై గత కొద్దీ రోజులుగా హరీష్ రావు vs కాంగ్రెస్ (Harish Rao vs Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నామని కాంగ్రెస్ అంటుంటే…10 % కూడా సరిగ్గా రుణమాఫీ చేయలేదని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై సీఎం రేవంత్ …హరీష్ రావు ల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు మరోసారి సీఎం ఫై విరుచుకపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

TG: సీఎం రేవంత్పై BRS MLA హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్​చాట్ కాదు, చీట్ ​చాట్ చేస్తున్నారని.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని హరీశ్​రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీ లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు అదానీకి అప్పగిస్తామని చెప్పిన సీఎం, అసెంబ్లీలో అడిగితే లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడానికి సీఎం చిట్​చాట్​లు వాడుకుంటున్నారని ఆక్షేపించారు. అలాగే రుణమాఫీ విషయంలో సీఎం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.

‘రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్. రుణమాఫీ కాలేదని మీ మంత్రులు రోజూ చెప్తున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్​. చేశారా? రుణమాఫీ సవాల్​ ఏమైందో రైతులే చెబుతారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారమే 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రైతులనే కాదు రాహుల్​ను కూడా రేవంత్​ మోసం చేశారు. రుణమాఫీ సభకు రావాలని సీఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్​ రాలేదు.’ అని హరీశ్​రావు అన్నారు.

Read Also : Kannayyanayudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్య నాయుడు