Harish Rao: అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్: కేంద్రంపై హరీశ్ రావు పైర్!

మందుల ధరలు పెంపు పై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. 

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే రైతు సమస్యలు, పంట నష్టపరిహారం లాంటి సమస్యలపై బీజేపీని నిలదీసిన ఆయన మరోసారి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల ధరలు పెంపు పై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. బిజెపి పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్ అని తనదైన స్టైల్ సెటైర్స్ వేశారు.

ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆయన అన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..?? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్.. అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు అన్నారు.

Also Read: Fire Accident: శ్రీరామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణప్రాయం!

  Last Updated: 30 Mar 2023, 05:31 PM IST