Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కు ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారు – మంత్రి హరీష్ రావు

Harish Rao Fire On Congress Party

Harish Rao Fire On Congress Party

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress Party) లో బరిలోకి దిగుతుంది. కర్ణాటక లో ఎలాగైతే విజయడంఖా మోగించారో..అదే విధంగా తెలంగాణ లో కూడా విజయ డంఖా మోగించాలని చూస్తుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరిగింది. రీసెంట్ గా బిఆర్ఎస్ (BRS) టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ గూటికి వస్తుండడంతో రోజు రోజుకు కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఇక ఇప్పుడు గ్యారెంటీ పధకాలను కాంగ్రెస్ ప్రకటించి ప్రజల్లో కొత్త చర్చ కు దారితీసింది. ఈ పథకాలతో ప్రజలను ఓట్లు అడిగేందుకు సిద్ధమైంది. దీంతో అధికార పార్టీ బిఆర్ఎస్ లో కాస్త భయం మొదలైంది.

అందుకే బిఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ ప్రకటించిన పధకాలఫై విమర్శలు చేయడం చేస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు (Minister Harish Rao ) కాంగ్రెస్ ఫై విమర్శలు చేసారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను ముందు కర్నాటకలో నేరవేర్చి ఆ తర్వాత తెలంగాణలో ప్రకటించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు కర్ణాటక (Karnataka) లో ఎన్ని హామీలు ఇచ్చారో.. అందులో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజలకు తెలుసన్నారు. 2014వ సంవత్సరానికి ముందు తెలంగాణలో విద్యుత్‌ ఎలా ఉండేదో..ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు మోటర్ల వద్ద పడుకొని పాము కాటుకు, తేలు కాటుకు బలైన సంఘటనలు ఉన్నాయన్నారు. గతంలో కేవలం 3 గంటల విద్యుత్‌ మాత్రమే రావడంతో ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందేది కాదని, దీంతో పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి కరెంట్‌ పోతే వార్తగా మారిందన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆభివృద్ధి చేశారన్నారు.

Read Also : Indrakeeladri : ద‌స‌రా ఉత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఇంద్ర‌కీలాద్రి

కాంగ్రెస్ జూటా మాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక వంకరే అన్న చందంగా ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఉచిత బస్సు అన్నారు. ఉన్న బస్సు బంద్ పెట్టారు. కాంగ్రెస్ నాలుగు వేలు పింఛన్ కర్ణాటకలో ఇచ్చి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడటని ఎద్దేవా చేశారు.