Harish Rao: మోడీ రాష్ట్రపతిని పిలుస్తున్నారా? గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్!

తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
governor harish rao

governor harish rao

తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం, గవర్నర్ (Governor) ఆ విషయాన్ని తప్పుబట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు పిలుపు అందలేదని.. ఆహ్వానిస్తే తప్పకుండా హజరయ్యేదాన్ని అని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా, మహిళగా తమిళిసై సౌందర్ రాజన్‌ను గౌరవిస్తామని మంత్రి హరీశ్ రావు (Harish rao) స్పష్టం చేశారు.

సచివాలయం ప్రారంభించాలంటే గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో రాసుందా అని ఆయన ప్రశ్నించారు. వందే భారత్ రైలును ప్రారంభించే సమయంలో రాష్ట్రపతిని పిలిచారా? వందే భారత్ (Vande Bharath) రైలును ప్రధాని మోడీ ఎన్నో సార్లు ప్రారంభించినా రాష్ట్రపతికి ఆహ్వానమే లేదు. ఆ విషయాన్ని మేం అడిగామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి ఎంతో బాధ కలిగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆమె ప్రవర్తన ఉందని హరీశ్ రావు అన్నారు.

చిన్న చిన్న సాకులు చూపించి ఎన్నో బిల్లులను ఆమె పెండింగ్‌లో పెట్టారని.. సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక లేదని మంత్రి హరీశ్ వాపోయారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరనే కారణంతో.. వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయస్సు పెంచుతూ బిల్ పాస్ (Bill Pass) చేస్తే.. రాజ్‌భవన్‌లో ఏడు నెలల పాటు ఆపారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆ బిల్లులను ఏడు నెలల పాటు తన వద్దే ఉంచుకొని.. చివరకు ఆమోదం తెలపకుండానే తిప్పి పంపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇలా ప్రతీ విషయంలో అడ్డుపడుతున్న రాజ్‌భవన్‌కు మేమెందుకు వెళ్లాలి? అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read: Sharad Pawar: ఎన్‌సీపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై శరద్ పవార్ కమిటీ

  Last Updated: 05 May 2023, 11:58 AM IST