Site icon HashtagU Telugu

Harish Rao : కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది – హరీష్ రావు

Harishrao Cbn

Harishrao Cbn

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress-BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం దగ్గరి నుండి కిందిస్థాయి నేతల వరకు ఎవ్వరు తగ్గడం లేదు..విమర్శలు , ప్రతివిమర్శలు , సవాల్ కు ప్రతి సవాల్ చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)..కాంగ్రెస్ సర్కార్ ఫై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరవు లేదని, కానీ కాంగ్రెస్ వచ్చింది..కరువు మొదలైందన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయి.. కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ పాలనలోనే పదేళ్లు కరువే లేదని.. కాంగ్రెస్‌ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటర్లు కాలుడు మొదలైందని.. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఈసారి తప్పితే కాంగ్రెస్‌ వాళ్లు ఐదేళ్లు దొరుకరని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తరన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందని, రూ.2లక్షల రుణమాఫీ కానివాళ్లు బీఆర్‌ఎస్‌ ఓటేయాలని కోరారు. వరిధాన్యం క్వింటాల్‌కు రూ.2500 ధరతో కొంటామన్నారని.. క్వింటాల్‌కు రూ.2500 ధరతో వరి ధాన్యం కొనాలని నిలదీయాలన్నారు. ఆసరా ఫించన్‌ రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందని.. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు అవ్వాతాతలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Read Also : Ram Charan : రామ్ చరణ్ కు డాక్టరేట్ ..చెన్నై వేల్స్ యూనివర్సిటీ ప్రకటన