మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ..కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నారు. పదేళ్లుగా పచ్చగా ఉన్న తెలంగాణ ఈరోజు కరువు తో కటకటలాడుతుందని ఎద్దేవా చేసారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని..కనీసం తాగేందుకు నీరు కూడా లేక చాల గ్రామాలు అవస్ధలు పడుతున్నాయన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందని అన్నారు. గ్రామాల్లో తాగు నీరు రావడంలేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని .. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పార్టీ పనిగాపెట్టుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని తట్ట మట్టి కూడా ఎత్తలేదు. రైతు రుణమాఫీపై అతీగతీ లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
సీఎం (CM Revanth) గారు పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి. తాగడానికి నీళ్ళు లేక జనం గోస గోస పడుతున్నారు మీ పాలన వచ్చింది ఖాళీ బిందెలు, నిండుగా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి అన్నారు. కేసీఆర్.. కిట్లు ఇస్తు.. రేవంత్ మాత్రం తిట్లతో పోటీ పడుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. ఇదీ కాంగ్రెస్ ఘనత. కరువును పెంచడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ వంద రోజుల పాలన లో 174మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 34మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also : Ram Charan Peddi : ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్..?