కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో(Praja Palana Sabha ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి , సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు’ అని, పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక.. చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు’ అని హరీశ్ రావు మండిపడ్డారు.
కేసీఆర్ (KCR) తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని , మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనని, రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్‌హౌజ్‌లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా హరీష్ రావు స్పందిస్తూ రేవంత్ తీరు పై మండిపడ్డారు. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి.. నువ్వు కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ గారి నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ గారి వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.
Read Also : Cranberries : గుండె ఆరోగ్యం నుండి డయాబెటిస్ నియంత్రణ వరకు, ఈ ఎర్రటి పండు సహాయపడుతుంది