Harish Rao : పార్టీని వీడుతున్న నేతలను బ్రోకర్లతో పోల్చిన హరీష్ రావు

కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని దుయ్యబట్టారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao Rythubandhu

Harish Rao Rythubandhu

బిఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిది…పదేళ్ల పాటు ఉన్నత పదవులు అనుభవించినవారు సైతం పార్టీని వీడుతుండడం తో పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా కేకే, కడియం , ఇంద్ర కిరణ్ వంటి నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతుండడం తో ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో కూడా అధిష్టానానికి అర్ధం కావడం లేదు. అందుకే పార్టీని వీడుతున్న నేతలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ… కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని దుయ్యబట్టారు. ఇదేమీ బీఆర్ఎస్ కు కొత్త కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని పది మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని .. రానే రాదు అన్న తెలంగాణ సాధించిపెట్టారని గుర్తు చేశారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని ఆయన విమర్శించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరన్నారు.

మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్ళు పార్టీలో నుంచి వెళ్లిపోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని ఆయన పేర్కొన్నారు.

Read Also : Phone Tapping Case: కేటీఆర్‌కు పదేళ్లు జైలు శిక్ష: కోమటిరెడ్డి

  Last Updated: 29 Mar 2024, 04:04 PM IST