Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి: హరీష్

Telangana (79)

Telangana (79)

Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ సిద్దిపేట నుంచి తాను ఏడోసారి నామినేషన్ దాఖలు చేశానని, ఇక్కడి ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.

సిద్దిపేట ప్రజలు తనకు కుటుంబ సభ్యులలాంటి వారని హరీశ్‌ అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా ఎన్నో పనులు చేశానన్నారు. గతంలో తెలంగాణలో కరువు, ఆకలి చావులు, వలసలు ఉండేవని చెప్పారు.

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మార్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి రాష్ట్రాన్ని మరో పదేళ్లు వెనక్కి వెళ్లనీయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక

Exit mobile version