Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!

2014-15లో సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Resizeimagesize (1280 X 720) (2) 11zon

2014-15లో సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) కు మరోసారి లేఖ రాశారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా, పొరపాటున మొత్తం సిఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెల్లిందన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రూ. 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని పేర్కొన్నారు.

Also Read: IAS Smita Sabharwal : మ‌హిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి చొర‌బొడ్డ డిప్యూటీ త‌హ‌సీల్దార్‌

ఈ విషయంపై అనేక సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశామని చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు పొరబాటున విడుదల చేసిన రూ.495 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో విన్నవించారు.

  Last Updated: 22 Jan 2023, 01:05 PM IST