Site icon HashtagU Telugu

Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్

Telangana

Telangana

Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసిందని తెలిపారు. పంటలు కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో వడగళ్ల వాన పడటం ద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు హరీష్.

బొప్పాయి, మామిడి వంటి ఉద్యాన పంటలతో పాటు వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాలు కురిసి రైతులు నష్టపోయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతులను కలుసుకుని ఓదార్చారని గుర్తు చేశారు. రైతులకు ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇస్తామని అక్కడికక్కడే ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతులను పట్టించుకోకుండా రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు.

Also Read: Razakar : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ