Site icon HashtagU Telugu

Minister Harish Rao : పొంగులేటిపై మంత్రి హ‌రీష్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్

Minister Harish Rao

Minister Harish Rao

ఖ‌మ్మం జిల్లాలో మంత్రి హ‌రీష్‌రావు (Harish Rao) ప‌ర్య‌టించారు. పోడు భూముల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. పొంగులేటి (Ponguleti) , రేవంత్ రెడ్డి (Revanth Teddy) పై హాట్ కామెంట్స్ చేశారు. పోడు పట్టాలు (Podu Pattalu) మీరు మధ్యలో వదిలేశారు.. గతంలో మీరు పూర్తిగా ఇచ్చిఉంటే మేము ఇచ్చే పరిస్థితి ఉండేదా? గతంలో కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా అమలు చేయలేదు. మేము మేనిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేస్తున్నాం అని హ‌రీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు కోటలు దాటాయి తప్ప ఆచరణ లో లేవు. మీ పాలన వద్దని కేసీఆర్‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు బ్రహ్మ‌రధం పట్టారు.

రాహుల్ గాంధీ ఖమ్మంకు వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారు అంటూ హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పరిపాలించే రాష్టంలో రైతు బంధు ఉందా..? వారు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో అమలు చేయరుగాని, మన దగ్గరకు వచ్చి పెద్దపెద్ద హామీలు ఇస్తారు అంటూ హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండానే హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లాకు ప‌ట్టిన శ‌ని వ‌దిలింది.. శ‌కుడు వ‌దిలిపోయిండు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌దికి తొమ్మిది స్థానాల్లో మ‌న‌మే గెలుస్తామ‌ని హ‌రీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న రాష్ట్రం ఉందా..? కళ్యాణ లక్ష్మీ అమలు జరుగుతుందా.. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారా..? కాళేశ్వరం ప్రాజెక్టులాంటిది కట్టారా..? కేసీఆర్ కిట్లు లాంటివి ఇస్తున్నారా..? తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైన అమలవుతుందా..? అంటూ హ‌రీష్‌రావు కాంగ్రెస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు సాగునీళ్లు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.. రైతన్నలు కరెంటుకోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేశారు.. నేతన్నలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఖమ్మం వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? అంటూ మంత్రి హరీష్ రావు ప్ర‌శ్నించారు.

TSPSC Group 4 Rules: గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే మహిళ ఆంక్షలపై వివాదం