Harish Rao : హైడ్రా బాధితుల ఆవేదన వింటూ హరీష్ రావు కన్నీరు

Harish Rao : ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Harishrao Emoshanal

Harishrao Emoshanal

Harish Rao Cried : హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓటు వేసి గెలిపించుకొని తప్పు చేశామని వాపోతున్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోగా..తమను అనేక విధాలుగా బాధపెడుతున్నారని వారంతా మండిపడుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ వాసులైతే కనిపితే కొట్టేంత కోపంతో ఉన్నారు. హైడ్రా (Hydraa) పేరుతో సామాన్య ప్రజల ఇల్లు కూలుస్తుండడం వారిని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇప్పటికే బాధితులంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ వస్తున్నారు.

ఇక ఈరోజు బిఆర్ఎస్ పార్టీ (BRS Office) ఆఫీస్ కు వెళ్లి తమ బాధలను చెప్పుకున్నారు. ఏ రోజు, ఏ క్షణం హైడ్రా సిబ్బంది వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఎంతో కష్టపడి, కాయా కష్టం చేసుకుంటూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని.. ఒక్కసారికిగా హైడ్రా వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ హైడ్రా బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. హైడ్రా బాధితుల ఆవేదన వింటూ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..రేవంత్ ఫై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఖ్యాతిని సీఎం రేవంత్‌ దెబ్బ తీస్తున్నారని, అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే మూసీపై ముందుకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. కూకటపల్లిలో హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెండ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలకొట్టే సరికి గుండె పోటుతో చనిపోయిందన్నారు. ఇవ్వన్నీ రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్లే జరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్‌ రాజ్ నహి చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడని, మరి తెలంగాణలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. నేడు తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్నారు. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తరువాత బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ఇక్కడ ప్రచారం చేయాలన్నారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయన్నారు.

Read Also : Navaratri 2024: నవరాత్రుల సమయంలో ఇంటికి ఎలాంటి వస్తువులు తెస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

  Last Updated: 28 Sep 2024, 02:11 PM IST