Site icon HashtagU Telugu

TS : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై చర్చ కు మీము సిద్ధం..మీరు సిద్ధమా..? – హరీష్ రావు

Harish Cng

Harish Cng

కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్ట్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై శాసనసభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని..మీరు చర్చ పెడతారా..? అని ప్రశ్నించారు.

కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కృష్ణా, గోదావరిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం విధివిధానాలు విభజన చట్టంలో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నాని దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.

కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసిందని సీఎం రేవంత్ తెలిపారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ఆ కమిటీ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్‌, అధికారులు ఒప్పుకొనే సంతకాలు పెట్టారని రేవంత్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామన్నారు. రేవంత్ దగ్గర విషయం లేదు కనుకే విషం చిమ్ముతున్నాడన్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. బిల్లును తయారు చేసింది మీ జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అని నిలదీశారు. రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు సాగునీరు, తాగునీటికి సమస్య వస్తుందన్నారు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదన్నారు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదని.. పెదవులు మూతపడ్డాయి అంటూ విమర్శించారు.

Read Also : Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు

Exit mobile version