Site icon HashtagU Telugu

MLC Election : నవీన్‌కుమార్‌ రెడ్డి అభినందించిన హరీశ్‌ రావు

Naveenreddy

Naveenreddy

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించడం తో..బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తొలి విజయం అంటున్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్‌కుమార్‌ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మార్చి 28న ఎన్నికలు జరుగగా, ఆదివారం ఉదయం ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో నవీన్‌ కుమార్‌ మొదటి ప్రాధాన్య ఓట్లతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1,437 ఓట్లు పోలవగా బీఆర్‌ఎస్‌కు 763, కాంగ్రెస్‌కు 652, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు చొప్పున వచ్చాయి. మరో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Read Also : Pithapuram : పిఠాపురంలో భారీ ఈవెంట్..ఏమన్నా ప్లానా..?