సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర అంటూ హాట్ కామెంట్స్ చేసాడు. ఈరోజు తన పుట్టినరోజు (Revanth Reddy Birthday) సందర్బంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్..బిఆర్ఎస్ నేతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది జస్ట్ ట్రైలర్..అసలు సినిమా చూపిస్తాం అంటూ హెచ్చరించారు.
ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ దమ్ముంటే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నించాలని సవాల్ చేశారు. కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోందని .. తనకు కమిషన్లే కావాలనుకుంటే ధరణిలో బీఆర్ఎస్ వాళ్లు చేసినట్లే చేస్తే చాలని వ్యాఖ్యానించారు.
మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తానని సవాల్ చేశారు. ఇక సీఎం సవాల్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
సీఎం మూసీ పాదయాత్రలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై విరుచుకుపడ్డారు. ప్రజల మద్దతు ఉన్నప్పుడు, నిర్బంధాలు అవసరమా? అని ప్రశ్నిస్తూ, నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ పాప పరిహార యాత్ర చేస్తున్నట్టు ఉందంటూ, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనే మూసీ కాలుష్యం కారణమంటూ విమర్శించారు.
అదే విధంగా, గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన ఘటనతో పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రస్తావిస్తూ, విద్యార్థులకు తగిన వైద్యం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తారసపడిందని, పతనమవుతున్న గురుకులాల పరిస్థితిని సమీక్షించి, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సుమతీ శతకానికి సంబంధించిన పద్యాన్ని ట్వీట్ చేశారు. కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
ఈ పద్యం సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలందరు గమనిస్తున్నారు. నీ పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రి నీ ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది.
కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సిఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు.
తప్పు మీద తప్పు చేసి…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 8, 2024
Read Also : Health Tips : ఆస్తమా, బ్రోన్కైటిస్, COPD… ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి?