Harish Rao : కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు: హరీశ్ రావు

కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం.

Published By: HashtagU Telugu Desk
Harish rao comments on ktr Formula E Car Race issue

Harish rao comments on ktr Formula E Car Race issue

Harish Rao : తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని.. విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, కుట్రలు, అక్రమ కేసులతో మేం తగ్గుతామని రేవంత్ అనుకుంటున్నారు. మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. హైకోర్టు కేవలం ఏసీబీని కేసు విచారణ కొనసాగించాలని చెప్పింది. అంతేగానీ ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి అనే అంశమే లేదని హరీశ్‌ రావు అన్నారు.

కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్ళం కాదు.. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది. గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు. కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. గ్రీన్ కో కి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు. అదే గ్రీన్ కో కంపెనీ ఫార్ములా అయ్యే నిర్వహణలో భారీగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం అని హరీశ్ రావు అన్నారు.

రేవంత్ రెడ్డి ఏడాది తరువాత కేటీఆర్ మీద కేసు పెట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కేటీఆర్ అడుగడుగునా ప్రశ్నించడంతో కుట్రపూరితంగా ఆయన మీద కేసు పెట్టారు. ఫార్ములా ఈ కారు రేసును తమ రాష్ట్రాలకు రాలేదని, తెలంగాణ గ్రేట్ అని అంతా కొనియాడారు. న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. ప్రజలపక్షాన నిరంతరం పోరాటం చేస్తాం. అధైర్యపడే ప్రసక్తే లేదు. కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నా, దుష్ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు చూస్తున్నారు. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదు. కేసు ఓడిపోయారని, హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నట్లు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని హరీశ్‌ రావు అన్నారు.

Read Also: KTR : కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు..!

  Last Updated: 07 Jan 2025, 01:33 PM IST