Site icon HashtagU Telugu

TS Polls 2023 : కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలు – హరీష్ రావు

Harishrao Cbn

Harishrao Cbn

ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Harish Rao) తన దూకుడు కనపరుస్తున్నారు. ఓ పక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోపక్క ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కుంటూ కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) బలాలను తగ్గిస్తున్నారు. రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేశామని , మరోసారి ఛాన్స్ ఇస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని చెపుతూ వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై విమర్శలు కురిపిస్తూ ఈ రెండు పార్టీలు తోడు దొంగలే అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka)లో ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను దుబ్బాకలో జరగనుంది. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులకే బీజేపీపై నమ్మకం లేదని, మరి ప్రజలకెలా విశ్వాసముంటుందని ప్రశ్నించారు. వారు చెప్పే మాటలన్నీ నీటిమీద రాతలేనని విమర్శించారు.

బీజేపీ మ్యానిఫెస్టో ఒక అబద్ధమని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక్క సీటేనని, ఈసారి డకౌటో లేదా ఒకటి రెండుకు సీట్లు గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ప్రజల ఆకాంక్షలను ఏవిధంగా నెరవేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా, మోసం చేసేలా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చిందని, అభివృద్ధి కావాలంటే కేసీఆర్‌ రావాలన్నారు. 24 గంటల కరెంటు కావాలన్నా, కాళేశ్వరం నీళ్లు రావాలన్నా కేసీఆర్‌ రావాలంటున్నారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేని విమర్శించారు. చేనేత కార్మికులపై జీఎస్టీ వేసిందని, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద ప్రజలకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హ్యాండ్లూం బోర్డును రద్దుచేసిందెవరు, బీడీ కార్మికులు, నేతన్నల నడ్డి విరిచిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు బీడీ కార్మికులకు అన్యాయం చేశాయని వెల్లడిరచారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి, జీఎస్టీ వేసిన బీజేపీకి బీడీ కార్మికులను ఓట్లడిగే నైతిక హక్కులేదన్నారు. రెండు పార్టీలు బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు. కానీ నెలనెలా రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చి సీఎం కేసీఆర్‌ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Read Also : Kodali Nani : టీడీపీ కి కొడాలి నాని సవాల్..నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా ..

Exit mobile version