Harish Rao : తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చిన హరీష్ రావు

నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్లే ఈరోజు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖను పట్టుకొని వచ్చారు

Published By: HashtagU Telugu Desk
Harish Rao Revanth

Harish Rao Revanth

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం వాడివేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) నేతల మధ్య సవాళ్లు – ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)..సీఎం రేవంత్ (CM Revanth Reddy) కు సవాల్ విసిరారు. అమరవీల స్థూపం (Telangana Martyrs Memorial) వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని.. నువ్వు వస్తావా.. అని ప్రశ్నించారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు, స్పీకర్‎కి ఇస్తారు. ఒకవేళ చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్‎కు ఇస్తారని తెలిపారు. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్లే ఈరోజు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖను పట్టుకొని వచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో ఆయన హరీశ్‌ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు వచ్చారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు che. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకుగాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read Also : SRH CEO Kavya: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు సీఈవో కావ్య ఆస్తి ఎంతో తెలుసా..?

  Last Updated: 26 Apr 2024, 11:42 AM IST