తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సిద్ధిపేట జిల్లా జగదేవపూర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ తాను తీసుకున్న బాధ్యతను గౌరవించకుండా, ప్రజల సమస్యలకంటే వినోద కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అందాల పోటీలు పెట్టడం, వాటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చిందని ఆరోపించారు.
Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు
రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం, రైతు బోనస్‌ను ఇవ్వకుండా ఆలస్యం చేయడం, ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తానని సీఎం చేసిన వాగ్దానం నిలబెట్టుకోకపోవడం ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తిని పెంచిందన్నారు. పింఛన్లు పెంచుతామని చెప్పి పెంచకపోవడం, విద్యా రంగంలో గురుకులాల్లో అభివృద్ధి కరవవడం వంటి అంశాలను గుర్తు చేశారు. జిలుగు విత్తనాల ధరలు రెండు రెట్లు పెరిగాయని, రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.
HHVM : సమయం లేదు ట్రైలర్ లేదు…ఏంటి వీరమల్లు ఈ ఆలస్యం
రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ పతనమైందని, ప్రజలు ఇల్లు నిర్మించలేక బ్యాంకులకు తాకట్టు వేస్తున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. మూసి నది పునరుద్ధరణ, హైడ్రా ప్రాజెక్టు వంటివి మాటల్లోనే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో పారిశ్రామిక అభివృద్ధికి తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చివరగా వచ్చే మూడు సంవత్సరాల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వారి పార్టీ కార్యకర్తలకే లబ్ధి అందిస్తుందని, కానీ కేసీఆర్ హయాంలో అందరికీ అభివృద్ధి అందినదని హరీష్ రావు స్పష్టం చేశారు.