Site icon HashtagU Telugu

KTR : త్వరలో కాంగ్రెస్ నుండి వేదింపులు ఎక్కువగా ఉంటాయి..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి- కేటీఆర్

KTR

KTR

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(COngress Govt) నుండి అనేక వేదింపులు , కేసులు , దాడులు ఉంటాయి..ఈ కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్దపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బిఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. జాన్వాడ రేవ్ పార్టీ కేసు(Janwada Rave Party Case)పై ట్విట్టర్ వేదికగా మరోసారి కేటీఆర్ స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తమ కుటుంబం పై బురదజల్లే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే..కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపడంలో మద్దతు పలికిన బీఆర్‌ఎస్‌ నాయకులు, సోషల్‌మీడియా వారియర్స్‌కు ధన్యవాదాలు. రెండు రోజులుగా మనం చూసింది సుదీర్ఘమైన రాజకీయ కక్ష సాధింపుల ప్రహాసనంలో తొలి అంకం మాత్రమే ..రానున్న రోజుల్లో అనేక విధాలుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తారని ..వారి కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్దపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అక్రమ కేసులు పెడతారని.. డీప్‌ఫెక్‌ టెక్నాలజీతో వీడియోలు వదులుతారని.. పెయిడ్‌ ఆర్టిస్టులతో నాటకాలు వేస్తారని కేటీఆర్‌ హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు తమ పెయిడ్‌ సోషల్‌మీడియా ట్రోల్స్‌ అందరూ మనపై దాడికి ఏకమవుతారని పేర్కొన్నారు. ఈ దాడులను చూసి ఆగం కావద్దని.. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో ఏ మాత్రం పక్కకు జరగవద్దని సూచించారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం మనం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్థత, ద్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు బయటపెడదామని సూచించారు.

Read Also : Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు