Site icon HashtagU Telugu

Hyderabad: స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓఎస్డీ హరికృష్ణ సస్పెండ్

Hyderabad

New Web Story Copy 2023 08 13t132329.108

Hyderabad: వాయువరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. స్కూల్ విద్యార్ధులపై లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అధికారి. స్పోర్ట్స్ స్కూల్ లో ఓఎస్డీగా పనిచేస్తున్నారు హరికృష్ణ. కొంతకాలంగా బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అర్ధరాత్రి వారి గదిలోకి వెళ్లి బాలికలపై అసభ్యంగా ప్రవర్తించడం, కొంతమంది బాలికలను బయటకు తీసుకెళ్లి మాయమాటలతో వారితో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడు. బాధాకరం ఏంటంటే ఆ ఓఎస్డీకి ఓ మహిళా అధికారి హెల్ప్ చేస్తుందట. ఆమెతోనూ హరికృష్ణ అక్రమ సంబంధం నడుపుతున్నట్టు సదరు విద్యార్దునులు చెప్తున్నారు. అయితే ఈ విషయం ప్రముఖ పేపర్లలో ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆదేశించారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే ప్రతిస్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి హరికృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఓఎస్డీ హరికృష్ణను తప్పిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఉపేక్షించబోమని వర్కింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూపై దర్యాఫ్తు జరిపించి రెండు రోజుల్లో దోషులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఈ తప్పుడు పని చేసినవారిలో అధికారులు, నాయకులు, ఉద్యోగులు.. ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Also Read: UK Visa: యూకే వెళ్లడానికి వీసా కావాలా..? అయితే ఈ హోటళ్లలో వీసా కోసం దరఖాస్తు చేసుకోండి..!