Site icon HashtagU Telugu

Tamilisai: గవర్నర్ కు షాకిచ్చిన హ్యాకర్లు.. మరోసారి సోషల్ మీడియా ఖాతా హ్యక్

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

ఇటీవల హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీలను అకౌంట్ హ్యాక్ చేస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా మరోసారి గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ అయినట్లు గుర్తించారు. ఈ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ముంబై కేంద్రంగా ఓ సంస్థ నుంచి హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల దర్వారా అన్వేషిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బోటిక్ మూసి వేసినట్లు గమనించారు.

అయితే.. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్ తమిళ్ సాయికి మెయిల్ వచ్చినట్లు సమాచారం. దీంతో గవర్నర్ తన ఖాతా తెరవడానికి ప్రయత్నించగా పాస్‌వర్డ్ తప్పు వస్తుందని అధికారులు వెల్లడించారు. తమిళిసైకి సంబంధం లేని పోస్టులు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 14న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ X ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు కొత్త IP చిరునామాలు గుర్తించారు.
సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలను పంపాలని కోరారు. అందిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై నుంచి అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.

Exit mobile version