Gutha Sukender Reddy: తెలంగాణ రాష్ట్రంపై సమైఖ్యవాదుల కుట్ర.. గుత్తా కామెంట్స్!

టీఆర్ఎస్ నేత, నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 03:15 PM IST

టీఆర్ఎస్ నేత, నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడారు.  సంవత్సరకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం కోసం జాతీయ పార్టీల కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి, బి‌జే‌పి దత్త పుత్రిక షర్మిలా పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, ED,CBI దాడులు, MLA ల కొనుగోలు వ్యవహారాలన్నీ సమైక్య వాదుల కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికే విఘాతం కలిగిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ ప్రజానీకం మేలుకోవాల్సిన  సమయం వచ్చిందని ఆయన అన్నారు. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అరాచక సంఘటలను, హత్యాలను, తుపాకుల మోతను, రక్తం ఏరులై పారినా బాంబుల మోతను, రౌడీల రాజ్యాన్ని, భూ కబ్జాలు, అనేక ఘటనలను భరించామని అన్నారు. పోరాడి తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్రoలో  అలాంటి సంఘటనలు పునారావృత్తం కాకుండ, మత విద్వేషాలను తిప్పికొట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

KCR, ఆయన కుటుంబాన్ని రాజకీయముగా అడ్డు తొలగించుకుంటే,  తెలంగాణాను ఆక్రమించుకోవచ్చునని సమైక్య వాదులు కుట్రలు చేస్తున్నారని గుత్తా అన్నాడు. 2014లో బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మండలాలను ,సిలేరు పవర్ ప్రాజెక్టు ను ఏపీ రాష్ట్రములో కలిపి తెలంగాణ రాష్టానికి తీరని అన్యాయం చేసిందని, ఆ రోజు నుండి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవితి ప్రేమ చూపిస్తోంది అని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలననే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని సీనియర్ నాయకుడు గుత్తా వ్యాఖ్యనించారు.