తెలంగాణ (Telangana) లో ప్రభుత్వం మారితే మనకు మంచి రోజులు వస్తాయని భావించిన నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం మారిన మా ఎదురుచూపులు ఆగడం లేదని..ఉద్యోగాల కోసం రోడ్ల ఫై నిరసనలు తెలుపడం తప్పడం లేదని వారంతా వాపోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తుండగా..తాజాగా గురుకుల అభ్యర్థులు (Gurukula Teachers Protest) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ వారంతా వాపోయారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవడంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు.
Read Also : Padi Kaushik : బ్లాక్‌బుక్‌లో పొన్నం ప్రభాకర్ పేరు – కౌశిక్ రెడ్డి