గత పదేళ్ల బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు తమ ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారనే ఆరోపణలు మొదటి నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారం చేతిలో ఉండేసరికి వారు ఏంచేసినా చెల్లింది. చిన్న , పెద్ద ఇలా అన్ని తమకే దక్కేలా సాగించారు. చిన్న కాంట్రక్ట్ దగ్గరి బడా కాంట్రక్ట్ల వరకు అన్ని వారికే దక్కాయి. ఇదే క్రమంలో పేద విద్యార్థులను కూడా వదిలిపెట్టలేదని తెలుస్తుంది.
ప్రధానంగా, పేద విద్యార్థులు చదివే గురుకులాలను ఈ పార్టీ నేతలు వదలకుండా, తమకు సంబంధించిన సొంత భవనాలను అద్దెకు ఇచ్చినట్లు, మార్కెట్ రేట్లను అమలు చేయకుండా ఎక్కువ అద్దె రేట్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,023 గురుకులాలలో 80% గురుకులాలు గులాబీ నేతలకు సంబంధించిన భవనాల్లోనే నడుస్తున్నాయని, మిగతా భవనాలను అద్దెకు తీసుకోవడంలో రాజకీయ ప్రోద్బలం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులను బెదిరించటం లేదా బుజ్జగించడం ద్వారా ఇష్టారీతిన అద్దె రేట్లు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.
గురుకులాలకు అవసరమైన సౌకర్యాలు లేనప్పటికీ, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ భవనాలను అద్దెకు తీసుకున్నారని సమాచారం. కొందరు బిల్డింగ్ యజమానులు, అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో, పాఠశాలలకు తాళాలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రాజకీయ ప్రోద్బలం కలిగిన చర్యగా భావిస్తున్నారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన స్థలాల్లో కాకుండా, నేతలకు చెందిన సొంత భవనాల్లో గురుకులాలను నడిపించడం జరిగినట్లు తెలిసింది.
దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు అక్టోబర్ 15న తిరిగి గురుకులాలకు వెళ్ళగా, కొన్ని చోట్ల పాఠశాలలకు తాళాలు వేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బిల్డింగ్ యజమానులు తమ పెండింగ్ అద్దె చెల్లింపు లేనందునే తాళాలు వేశారని, అద్దె చెల్లించిన తర్వాతే పాఠశాలలు తెరుస్తామని డిమాండ్ చేశారు. అయితే, ఈ పరిణామం వెనుక విపక్ష లీడర్ల ప్రోత్సాహం ఉందని ప్రచారం జరిగింది. సాధారణంగా బిల్డింగ్ యజమానులు ప్రభుత్వంతో వివాదాలు పెట్టుకోరు, కానీ వారికి రాజకీయ నేతల నుండి భరోసా ఇవ్వబడినట్లు తెలుస్తోంది. ‘మీ వెనుక మేమున్నాం’ అంటూ గులాబీ (బీఆర్ఎస్) నేతలు భరోసా ఇచ్చారని, ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక గురుకులం మాజీ మంత్రికి చెందిన బంధువుల సొంత భవనంలో నడుస్తోంది. ఈ భవనం గతంలో కోళ్ల ఫామ్‌గా ఉపయోగించబడేదిగా, తరువాత ఇంజినీరింగ్ కాలేజీకి మార్చి, ఆ కాలేజీ మూతపడిన తర్వాత, గురుకులం కోసం అద్దెకిచ్చారని సమాచారం.
Read Also : Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత..