Gruha Jyothi Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి స్కీం ఇంకా చాలామందికి అందలేదు. దరఖాస్తు చేసుకున్నా.. తమకు స్కీం అందలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రజలకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో జరిగిన పొరపాటు వల్ల చాలామందికి గృహజ్యోతి స్కీం అందలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అర్హులైన వారు తమకు సంబంధించిన వివరాలను మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో అందించి ఆ స్కీం ప్రయోజనాన్ని పొందొచ్చని సూచించారు. ఈక్రమంలో గతంలో సమర్పించిన ప్రజాపాలన అప్లికేషన్ నంబర్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లులను ప్రజాపాలన కేంద్రంలో సమర్పించాలని కోరారు. అప్లికేషన్ అప్ డేట్ అయ్యాక వాటిని పరిశీలించి అర్హులైన వారికి గృహజ్యోతి స్కీంను మంజూరు చేస్తారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
గృహజ్యోతి స్కీంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను(Gruha Jyothi Scheme) వినియోగించే వారికి కరెంటు బిల్లు ఉండదు. అంతకు మించిన కరెంటు వినియోగించే వారు ఈ స్కీంకు అర్హులు కాదు. ప్రజాపాలన దరఖాస్తుల్లో గృహజ్యోతి స్కీం విభాగంలో టిక్ చేయని వారికి సంబంధించిన దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొందరు ఆ విభాగంలో టిక్ పెట్టినా స్కీం మంజూరు కాలేదని అంటున్నారు. ఇలా జరగడం వల్ల గత ఏడు నెలలుగా తాము ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనాన్ని కోల్పోయామని చాలామంది నిరుపేద వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read :ED Officer Suicide : దారుణంగా ఈడీ అధికారి సూసైడ్.. కారణం అదేనా?
అర్హులైనా రుణమాఫీ అందని వారికి గుడ్ న్యూస్
మరోవైపు కొంతమంది రైతులు అర్హులైనప్పటికీ రుణమాఫీ అందలేదు. సాంకేతిక సమస్యల వల్ల అలా జరిగిందని అధికార వర్గాలు గుర్తించాయి. 31 సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని తేలింది. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ సర్కారు రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్నా రుణమాఫీ సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రుణమాఫీ అందని రైతులు తమ వివరాలను ఆయా మండలాల్లోని నోడల్ అధికారికి అందజేయాలని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.