Site icon HashtagU Telugu

Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్‌.. చంటి బిడ్డ‌తో ఒక‌రు, చేతులు లేక‌పోయినా మ‌రొక‌రు!

Group-3 Exam

Group-3 Exam

Group-3 Exam: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-3 ప‌రీక్ష‌లు (Group-3 Exam) ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మొత్తం రాష్ట్రంలోని 1401 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆది, సోమవారం ఈ రెండు రోజుల పాటు ప‌రీక్ష‌లు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జ‌రిగింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 జ‌రుగుతోంది. సోమ‌వారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-3 పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

చంటి బిడ్డ‌తో ఎగ్జామ్ సెంట‌ర్ వ‌ద్ద పడిగాపులు

గ్రూప్-3 ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. భార్య గ్రూప్-3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బ‌య‌ట 10 నెల బిడ్డను ఓ భర్త నిద్ర పుచ్చుతున్నాడు. శంకర్ అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్‌లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల బాబుని జోకొట్టి నిద్ర పుచ్చుతూ ఎగ్జామ్ సెంట‌ర్ బ‌య‌ట క‌నిపించాడు. దీంతో మహిళల కెరీర్ ఎదుగుదలలో భర్త పాత్ర ఎంతో ముఖ్యంగా మారింది అనడానికి నిదర్శనమే ఇది అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read: Rama Murthy Naidu Funeral : తమ్ముడి పాడె మోస్తూ చంద్రబాబు కన్నీరు

చేతులు లేక‌పోయినా గ్రూప్-3 ప‌రీక్ష‌కు

మ‌రొక జిల్లాలో చేతులు లేక‌పోయినా ఓ అభ్య‌ర్థి ఎగ్జామ్‌కు హాజ‌రై త‌న‌కు చ‌దువు ప‌ట్ల ఉన్న మ‌క్కువ‌ను చూపాడు. తెలంగాణ‌లోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ భాష జవహర్ నవోదయ విద్యాలయంలో గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యాడు. భాష‌.. పుట్టుకతో రెండు చేతులు లేకుండా జ‌న్మించాడు. అయినా అతను ఉన్నత చదువులు చదివాడు. తాజాగా గ్రూప్‌-3 పరీక్ష రాసిన అత‌ను ఉద్యోగం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. చ‌దువుకు అంగ‌వైక‌ల్యం అడ్డు కాదని నిరూపించాడు. భాష చేసిన ఈ సాహ‌సానిని అక్క‌డ ఉన్న అధికారులు సైతం అభినందించారు.