Site icon HashtagU Telugu

Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

Group-III Exam

Group-III Exam

Group 1 Mains Exams : తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రేపటి నుంచి (అక్టోబర్‌21) 27వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈ మేరకు గ్రూప్‌-1 పరీక్షల మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనుంది. హైరరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌ కేంద్రాల్లో ఐపీఎస్‌ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు.

పరీక్షల నిర్వహణలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని అదనంగా కేటాయించారు. స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిపరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా అందించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Read Also: MMTS : హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన