Site icon HashtagU Telugu

Group 1 Hall Ticket : గ్రూప్‌-1 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి 

Group 1 Hall Ticket

Group 1 Hall Ticket

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు మరో వారం గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈనేపథ్యంలో హాల్‌టికెట్లను(Group 1 Hall Ticket) ఇక అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతంలో రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు(Group 1 Hall Ticket) చెల్లవు. జూన్‌ 11న ఉదయం 10.30 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు వివరాలను టీఎస్‌పీఎస్సీ ( TSPSC ) సెక్రటరీ అనితా రామచంద్రన్‌ వెల్లడించారు. వెబ్‌సైట్‌లో నమూనా ఓఎంఆర్‌ షీట్‌ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు.

Also read : Student Suicide: TSPSC పేపర్ లీక్ ఎఫెక్ట్.. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య!

హాల్‌టికెట్లను ఈరోజు(ఆదివారం) నుంచి https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.  2022 అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తో దాన్ని రద్దు చేశారు. గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో కొన్నింటిని మార్చాలని టీఎస్‌పీఎస్సీ యోచిస్తున్నది. పరీక్ష కేం ద్రంలోకి అభ్యర్థులను అనుమతించే విషయంలో పకడ్బందీగా ఉండాలని నిర్ణయించింది. 503 గ్రూప్‌1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.