Site icon HashtagU Telugu

Group 1 : రెండు రోజుల్లోనే 1.33 లక్షల గ్రూప్-1 దరఖాస్తులు.. వాట్స్ నెక్ట్స్

TGPSC Group-1 Mains 2024

TGPSC Group-1 Mains 2024

Group 1 : తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తు గడువు శనివారం ముగిసింది. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమ ర్పించారు. ఈవిషయాన్ని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించు కునేందుకు మార్చి 23 నుంచి 27 వరకు ఛాన్స్ ఇస్తామని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేసుకోవచ్చన్నారు. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో పొందుపర్చాలని నవీన్‌ నికోలస్‌ కోరారు. ఒక్కసారి వివరాలు సవరించిన తర్వాత.. మరోసారి సవరణలకు అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి మార్చి 14తోనే గ్రూప్-1(Group 1) దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్పప్పటికీ..  చివరి రోజు సర్వర్‌ మొరాయించింది. దీంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. అప్పటివరకు కేవలం 2.7 లక్షల దరఖాస్తులే వచ్చాయి. అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మార్చి 16న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువును  పొడిగించారు. అంటే రెండు రోజుల్లోనే దాదాపు 1.33 లక్షల మంది కొత్తగా అప్లై చేశారన్న మాట. ఇక మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులకు గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ జూన్‌ 9న, మెయిన్స్‌ ఎగ్జామ్ అక్టోబర్‌ 21న జరగనుంది.

Also Read : Kavitha – Elections : కవిత అరెస్ట్.. బీఆర్ఎస్‌కు ప్లస్సా ? మైనస్సా ?

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
మొత్తం ఖాళీలు 563