Tehsildars Transfers: తహశీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాలకు తిరిగిపోయే (Tehsildars Transfers) విధంగా అవకాశం కల్పిచాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) మొదటి నుంచి చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే ఇదే విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ని పలు మార్లు టీజీటీఏ నేతలు కలిసి ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సమయంలోనూ ఇదే విషయాన్ని టీజీటీఏ బలంగా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాల్సిందిగా తహశీల్దార్లకు అవకాశం ఇస్తూ ఈమేరకు సీసీఎల్ఏ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, మహిళా అధ్యక్షురాలు పి. రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి మరియు నవీన్ మిట్టల్ కి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Varun Tej Matka : మట్కా కోసం పూర్ణా మార్కెట్ సెట్.. మేకింగ్ వీడియో..!
అందరికీ అవకాశం కల్పించేందుకు కృషి: టీజీటీఏ
అర్హత, ఆసక్తి, అవకాశం ఉన్న ప్రతి తహశీల్దార్‌కు బదిలీకి అవకాశం కల్పించాలని టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్ కోరారు. ఎన్నికల బదిలీల విషయంలో ఇప్పటికే కొంత జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల సమయంలో బదిలీ అయిన ప్రతి తహశీల్దార్‌కు సొంత జిల్లాలకు వెళ్లె విధంగా అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఒక తహశీల్దార్‌కు బదిలీ అవకాశం కల్పించేందుకు టీజీటీఏ కృషి చేస్తుందన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: One Nation One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మాకొద్దు.. కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం