Site icon HashtagU Telugu

Woman : రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప అవకాశం !

Sbi Rseti

Sbi Rseti

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBIRSETI) శుభవార్త అందించింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని సంస్కృతి విహార్ ప్రాంగణంలో ఈ సంస్థ ద్వారా గ్రామీణ యువతికి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు దారిగా మారుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు కాగా, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు ఇది మంచి అవకాశం కానుంది.

Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్

ఈ సంస్థ ద్వారా టైలరింగ్, బ్యూటీ పార్లర్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫోటోగ్రఫీ, టీవీ టెక్నీషియన్, ప్లంబింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ వంటి 36 రకాల శిక్షణలలో ఉచిత శిక్షణ అందించనున్నారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడుతాయి. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ముద్రా లోన్ కింద రూ.50,000 వరకు రుణ సదుపాయం కూడా కల్పించనున్నారు. ఈ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అధికారికంగా సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.

హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దరఖాస్తుకు నాలుగు పాస్‌ఫోటోలు, రేషన్ కార్డు, ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలతో కలిపి ఈ నెల 6లోగా హసన్‌పర్తిలోని SBIRSETI కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు 9704056522, 9849307873, 9949108934, 6281260876 నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ శిక్షణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, స్వయం ఉపాధి దిశగా వారిని నడిపించనుంది.