BRS MLAs: పడిపోయిన ఎమ్మెల్యేల గ్రాఫ్.. 40 మందికి నో టికెట్స్?

సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని బీఆర్ఎస్ పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Increase Sanitation and RTC employees Salary on Mayday by CM KCR

Increase Sanitation and RTC employees Salary on Mayday by CM KCR

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కింత ఆందోళన కనిపిస్తోంది. ఈసారి టికెట్ దక్కుతుందా? తన పోటీగా మరో నేతకు అధిష్టానం సీటు అప్పజెప్పుతుందా? అనే ప్రశ్నలు ఎమ్మెల్యేల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ హ్యాట్రిక్ విజయం సాధించి ఇటు తెలంగాణ, అటు కేంద్రంలో తనకు తిరుగులేదని చాటిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తనకందిన రిపోర్టుల ఆధారంగా సుమారు 40 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే వాళ్ళు కూడా బీజేపీ, కాంగ్రెస్ లోకి జంప్ చేసేట్లుగా మంతనాలు జరుపుతున్నారట. ఇలా ఇతరపార్టీలతో మంతనాలు జరుపుతున్న వాళ్ళను కేసీయార్ టార్గెట్ చేసినట్లు సమాచారం. వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టించారట. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు ? ఎవరితో మంతనాలు జరుపుతున్నారు ? వాళ్ళ వ్యూహాలు ఎలాగ ఉండబోతున్నాయనే విషయాలను కేసీయార్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో తొందరలోనే అంటే జూలై లేదా ఆగస్టులో మొదటి విడత జాబితాను విడుదలచేయాలని కూడా డిసైడ్ అయ్యారట.

సుమారు 60-70 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. షెడ్యూల్ ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సుంది. అంటే ఎన్నికలకు మరో ఆరుమాసాలు మాత్రమే ఉంది. అభ్యర్దులను ఇప్పుడే ప్రకటించేస్తే జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవటానికి, అసంతృప్తులు ఎవరైనా ఉంటే సర్దుబాటు చేసుకునేందుకు తగిన సమయం ఉంటుందన్నది కేసీయార్ ఆలోచన. అయితే ఇదే సమయంలో టికెట్ దక్కని వాళ్ళు తిరుగబడే అవకాశముంది, ఇతర పార్టీల్లోకి జంప్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ అధినేత ఏం చేస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడిపోయారు.

Also Read: Shocking: ఇంటి కరెంట్ బిల్లు 7 లక్షల 97 వేలు, యజమాని గుండె గుభేల్లు

  Last Updated: 20 Jun 2023, 06:10 PM IST