Site icon HashtagU Telugu

Mahipal Reddy: ఈడీ సంచలనం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే 300 కోట్ల అక్రమాలు

Mahipal Reddy

Mahipal Reddy

Mahipal Reddy: పటాన్‌చెరు ఇసుక, గ్రానైట్‌ సరఫరాకు సంబంధించి విచారణ జరుపుతున్న ఈడీ నగరంలోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. గూడెం మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గూడెం మధుసూదన్ రెడ్డికి సంబందించిన ఇసుక, గ్రానైట్ సరఫరాపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ.

మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఆయనకు సంబందించిన ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపింది. సోదాలు పూర్తి కావడంతో ఈడీ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో మహిపాల్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు పేర్కొంది. రూ.300 కోట్లమేర అక్రమాలు జరిగాయని సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం కలిగించారని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని, ఈ డబ్బుతో రియల్‌ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది ఈడీ. కాగా గత రెండు రోజులుగా జరిపిన సోదాల్లో 19 లక్షలు వెలుగు చూశాయి. ఈ సొమ్మును ఈడీ స్వాధీనం చేసుకుంది. అలాగే బినామీల పేర్లతో లావాదేవీలు, కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని ఇంకా తెరవాల్సి ఉంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ తన తాజా ప్రకటనలో పేర్కొంది.

Also Read: Indian 2 : పుష్ప 2 డేట్ పై కన్నేసిన ఆ సూపర్ హిట్ సీక్వెల్..?