ఘ‌నంగా ముగిసిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ క్రీడా వేడుకలు

ఆయన 'డాక్టర్ టి.డి.ఆర్' గా సుపరిచితులు. రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలలో నిపుణులు. 2017లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లో 'అవుట్‌స్టాండింగ్ సర్వీస్ అండ్ చారిటీ' అవార్డును అందుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Bosch Sports Meet

Bosch Sports Meet

Bosch Sports Meet: ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ సంస్థ ‘బాష్’ అనుబంధ సంస్థ అయిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించిన వార్షిక క్రీడల ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యశోద హాస్పిటల్స్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తేతలి దశరథ రామారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

నిపుణుల సూచనలు: పనిలో, ఆటల్లో జాగ్రత్తలు

ఈ సందర్భంగా డాక్టర్ దశరథ రామారెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఐటీ నిపుణులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు

ఎర్గోనామిక్స్: కంప్యూటర్ ముందు కూర్చునే విధానం సరిగ్గా లేకపోతే వెన్నెముక, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని, సరైన భంగిమను పాటించాలని సూచించారు.

Also Read: పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

క్రీడలలో భద్రత: క్రీడలు ఆడే సమయంలో కండరాల గాయాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

క్రమబద్ధమైన వ్యాయామం: శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసానికి, పనిలో ఉత్పాదకత పెంచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఘనంగా సత్కారం

వైద్య రంగంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉండి, వేలాది శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ దశరథ రామారెడ్డిని ఈ సందర్భంగా బాష్ హైదరాబాద్ విభాగం అధిపతి అంజాద్ ఖాన్ పఠాన్ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

డాక్టర్ టి.డి.ఆర్ గురించి క్లుప్తంగా

ఆయన ‘డాక్టర్ టి.డి.ఆర్’ గా సుపరిచితులు. రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలలో నిపుణులు. 2017లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లో ‘అవుట్‌స్టాండింగ్ సర్వీస్ అండ్ చారిటీ’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాష్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

  Last Updated: 17 Dec 2025, 09:24 AM IST