KTR : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: కేటీఆర్‌

Viral fevers: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు.. నొప్పులు.. వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు... చర్యలు లేవు.

Published By: HashtagU Telugu Desk
Govt doesn't care about public health: KTR

Govt doesn't care about public health: KTR

Viral fevers: తెలుగు రాష్ట్రాల ప్రజలను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పితో పాటు జలుబు వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆసుపత్రిలో చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు.

”ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు.. నొప్పులు.. వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు… చర్యలు లేవు. విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళూ.. ఇళ్లూ గుళ్లవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. బస్తీలకు సుస్తీ చేసింది.. పల్లెలు మంచం పట్టినయ్.. అయినా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి.. దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే.. అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు” అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

మరోవైపు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని గంభీరావుపేట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పలు గ్రామాలు నిత్యం సమస్యలతో పోరాటం చేస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం కేటీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్లను గాలికి వదిలేయడం సరికాదన్నారు. 3 మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు.గతంలో ఆర్భాటం చేశారు కానీ,బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదన్నారు.కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఇకనైనా నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష.. కనకదుర్గ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్

  Last Updated: 24 Sep 2024, 10:48 AM IST