Gaddar Awards Committee: గద్దర్ అవార్డుల కోసం నామకరణం మరియు లోగోతో సహా విధివిధానాలు, నియమాలు మరియు నిబంధనలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు.
గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి నర్సింగ్‌రావు, వైస్ చైర్మన్‌గా వి వెంకటరమణారెడ్డి(దిల్ రాజు) వ్యవహరిస్తారు. ఇతర సలహా సభ్యులుగా కె రాఘవేంద్రరావు, అందె ఎల్లన్న, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వి వెన్నెల, తనికెల భరణి, డి సురేష్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాది రెడ్డి, హరీష్ శంకర్, వేణు యెల్దండి (బలగం) ఉన్నారు.
గతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు గానూ నంది అవార్డులను ప్రదానం చేసేవారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నంది అవార్డుల పేరును మార్చి గద్దర్ అవార్డులుగా ప్రకటించింది. అయితే ఈ అవార్డుల విషయంలో కొద్దిరోజుల క్రితం గందరగోళంగా మారింది. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, చిత్ర పరిశ్రమ స్పందించలేదు. దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
Also Read: Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్