Site icon HashtagU Telugu

Vemulawada : రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళసై..!!

Governor

Governor

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్, ఆలయ ఈవో ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామక్రుష్ణ ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు గవర్నర్. వేదమంత్రాలతో పురోహితులు తమిళసైని ఆశీర్వదించారు. చారిత్రక, పురాతన ఆలయం రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం అద్రుష్టంగా భావిస్తున్నా అన్నారు. దేవి నవరాత్రుల సందర్బంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వెయ్యి సంవత్సరాల ఈ ఆలయాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్రప్రభుత్వం మరింత డెవలప్ చేయాలని అన్నారు.

ఆలయ డెవలప్ మెంట్ కోసం తన వంతు క్రుషి చేస్తానన్నారు. తెలంగాణలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.