Governor Serious : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళసై సీరియస్..!!

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి […]

Published By: HashtagU Telugu Desk
Hy02tamilisai

Hy02tamilisai

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైట్ చేశారు. 50మంది గుండాలు తమ ఇంటిపై దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ గుండాలను తనను బెదిరించారని పేర్కొన్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికలపై తనపై పోటీ చేయాలంటూ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మహిళలను భయపెట్డారు.నా తల్లిని బెదిరించారని అర్వింద్ ఆరోపించారు.

  Last Updated: 18 Nov 2022, 08:39 PM IST