Medaram : మేడారం సమ్మక్క , సారక్కలను దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా అమ్మవార్లను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించారు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర అట్టహాసంగా జరుగుతోంది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి గురువారం రాత్రి చేర్చారు. We’re now on WhatsApp. Click to Join. జాతర నేపథ్యంలో అడవి అంతా […]

Published By: HashtagU Telugu Desk
Governor Tamilisai Visits M

Governor Tamilisai Visits M

మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా అమ్మవార్లను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించారు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర అట్టహాసంగా జరుగుతోంది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి గురువారం రాత్రి చేర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

జాతర నేపథ్యంలో అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ (Tamilisai Soundararajan) కూడా వనదేవతలను దర్శించుకొని బంగారం సమర్పించారు. శుక్రవారం ఉదయం 11:05 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా, గవర్నర్‌ తమిళిసై మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క (Minister Seethakka), ఈటెల రాజేందర్‌, జిల్లా కలెర్టర్‌ ఇలా త్రిపాఠి తదితర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అక్కడ బంగారం సమర్పించారు.

ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామంలో సమ్మక్క సారలమ్మలను మంత్రి పొన్నం ప్రభాకర్ ద‌ర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసంద‌ర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మంత్రి మొక్కుకున్నారు. సర్వేజన సుఖినొభవంతు అందరు బాగుండాలని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుందన్నారు.

Read Also : MLA Lasya Nanditha Last Rights : అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు

  Last Updated: 23 Feb 2024, 01:19 PM IST