Site icon HashtagU Telugu

Governor and CS: తెలంగాణ సీఎస్‌పై తమిళిసై సీరియస్!

Cs And Governor

Cs And Governor

తెలంగాణ గవర్నర్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ తగ్గినట్టే అనిపించినా, మళ్లీ దూరం పెరిగింది. తాజాగా గవర్నర్ తమిళిసై తెలంగాణ సీఎస్ శాంతకుమారిపై సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి ప్రొటోకాల్‌ను పాటించడం లేదని, బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా కలుసుకోవడంలో విఫలమయ్యారని తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) విమర్శించారు.

రాజ్‌భవన్ ఢిల్లీ కంటే దగ్గరగా ఉన్నప్పటికీ, అధికారికంగా సందర్శించడానికి ప్రధాన కార్యదర్శికి సమయం దొరకడం లేదని గవర్నర్ ట్విట్టర్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్నేహపూర్వక అధికారిక సందర్శనలు, పరస్పర చర్చలు సహాయపడేలా ఉండాలని తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఢిల్లీ కంటే సమీపంలో ఉందని గవర్నర్ తన (Governor Tamilisai) ట్వీట్‌లో చీఫ్ సెక్రటరీకి గుర్తు చేశారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “డియర్ తెలంగాణ సిఎస్ రాజ్‌భవన్ ఢిల్లీ కంటే సమీపంలో ఉంది. సిఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మీకు అధికారికంగా రాజ్‌భవన్‌ను సందర్శించడానికి సమయం దొరకలేదు. ప్రోటోకాల్ లేదు! మర్యాదపూర్వకంగా కాల్ చేసినా మర్యాద లేదు. స్నేహపూర్వక అధికారిక సందర్శనలు & మీరు ఉద్దేశించని పరస్పర చర్యలు మరింత ఉపయోగకరంగా ఉండేవి.” మరో ట్వీట్‌లో ఆమె ఇలా రాసింది.. ‘‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గర్లో ఉందని మళ్లీ గుర్తు చేస్తున్నా. అంటూ రియాక్ట్ (Governor Tamilisai) అయ్యారు.

Also Read: KCR Election Survey: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్.. 25 మందికి నో టికెట్స్?