Telangana Governor : కేసీఆర్ ఆరోగ్యం గవర్నర్ తమిళి సై ఆరా..

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 09:17 PM IST

తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రమాదానికి గురైన దగ్గరి నుండి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తూ..ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక పార్టీల అధినేతలు , సినీ ప్రముఖులు..కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ కు వెళ్లి ఆయన్ని పరామర్శించి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో గవర్నర్ తమిళి (Telangana Governor Tamilisai Soundararajan)సై సైతం మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీశారు. కేసీఆర్ ప్రస్తుత హెల్త్ కండీషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో కేసీఆర్ పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకుంటారని గవర్నర్ తమిళి సై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నటులు చిరంజీవి , ప్రకాష్ రాజ్ తదితరులు యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

గత గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగింది. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతి రోజు కేసీఆర్ ను వాకర్ సాయంతో నడిపిస్తున్నారు.

Read Also : CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి