Site icon HashtagU Telugu

TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై

Tspsc

Tspsc

TSPSC: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్ విద్యార్థుల్ని మోటివేట్ చేసింది. లక్షలాది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గత కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందన్న వాదనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ ఇంపాక్ట్ గట్టిగా పడటంతో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడి పదవి కోల్పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిలో జరిగిన లోటుపాట్లను తేల్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు మరికొందరు సభ్యులు రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా తాజాగా గవర్నర్ తమిళిసై టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై నిర్ణయం ప్రకటించారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. పేపర్ లీకేజీ లాంటి విషయాలను సీరియస్ గా తీసుకుని సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి మరియు ఇతర సభ్యుల రాజీనామాలను తమిళిసై సౌందరరాజన్ జనవరి 10 ఆమోదించారు.

Also Read: Indian Railways: కదులుతున్న రైలు నుంచి మీ విలువైన వస్తువులు పడిపోయాయి.. అయితే వెంటనే ఇలా చేయండి?