Governor Rule : తెలంగాణ‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న, గ‌వ‌ర్న‌ర్ కు కాంగ్రెస్ విన‌తి

తెలంగాణలో రాష్ట్ర‌ప‌తి పాల‌న (Governor Rule) పెట్టాల‌ని కాంగ్రెస్ (యావ‌రేజ్) లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ (Bakka Jadson)విన‌త‌ప‌త్రం అంద‌చేశారు.

  • Written By:
  • Updated On - April 29, 2023 / 06:00 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న (Governor Rule) పెట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ని క‌లిసి కాంగ్రెస్ (యావ‌రేజ్) లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ (Bakka Jadson) విన‌త‌ప‌త్రం అంద‌చేశారు. బీఆర్ఎస్ పార్టీలోని 40 మందికి పైగా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డ్డార‌ని సీఎం కేసీఆర్ చెప్ప‌డాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లంద‌ర్నీ బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో పాటు రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న (Governor Rule)

దళిత బంధు పథకం, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై కమీషన్ లు నొక్కేస్తోన్న ఎమ్మెల్యేల‌పై జ‌డ్స‌న్ (Bakka Jadson) ప‌లు సంద‌ర్భాల్లో ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల క‌మీష‌న్ల భాగోతాన్ని సీఎం కేసీఆర్ (KCR) బ‌య‌ట‌పెట్టారు. వాళ్ల చిట్టా పై దర్యాప్తు చెయ్యాలని విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ కు జ‌డ్స‌న్ ఫిర్యాదు చేశారు. దళిత బంధు పథకం డబ్బుల విషయంలో కొందరు అవినీతికి పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. ప్ర‌ధానంగా గ‌జ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట, స్టేషన్ ఘనపూర్, చెన్నూర్ నియోజకవర్గల్లో జరిగిన అవినీతి పై దర్యాప్తు చెయ్యాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేశారు. దళిత బంధు పథకం డబ్బులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై కమీషన్ లు నొక్కేస్తున్న ఎమ్మెల్యేల‌పై సీఎం దర్యాప్తు కు ఆదేశించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

కమీషన్ లు నొక్కేస్తోన్న ఎమ్మెల్యేల‌పై జ‌డ్స‌న్

ఇటీవ‌ల టీఎస్ పీఎస్సీ పేప‌ర్ లీకేజీ విచార‌ణ విష‌యంలోనూ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింది. సుమారు 30ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌తో ప్ర‌భుత్వం ఆడుకుంటోంది. ఇదే విష‌యాన్ని బ‌క్కా జ‌డ్స‌న్ (Bakka Jadson) గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. పేప‌ర్ లీకేజీ మీద సీబీఐ విచార‌ణ చేయాలని కోరారు. ఆ మేర‌కు కొన్ని ఆధారాల‌తో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు, కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి నుంచి రాష్ట్రంలో జ‌రుగుతోన్న హ‌త్య‌లు, మాన‌భంగాలు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌దిత‌రాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రాజ్యాంగ సంస్థ‌ల‌కు తెలియ‌చేస్తూ జ‌డ్స‌న్ పోరాడుతున్నారు. డ్ర‌గ్స్, ఢిల్లీ లిక్క‌ర్ కేసు, మ‌నీ ల్యాండ‌రింగ్, భూ కుంభకోణాల‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌కు కొన్ని ఆధారాల‌తో ప‌లు సంద‌ర్భాల్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల అవినీతి అంశాన్ని గ‌వ‌ర్న‌ర్ (Governor Rule) దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : BRS :మ‌రాఠాపై KCRఎత్తుగ‌డ‌,BRS ఔరంగాబాద్ స‌భ‌

రాష్ట్రంలోని ప‌రిస్థితుల దృష్ట్యా రాష్ట్ర‌ప‌తి పాల‌న (Governor Rule) పెట్టాల‌ని జ‌డ్స‌న్ కోరుతున్నారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన బీఆర్ఎస్ ప్ర‌తినిధుల స‌భ‌లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి పాల్ప‌డుతోన్న ఎమ్మెల్యేల జాబితా త‌న వ‌ద్ద ఉంద‌ని హెచ్చ‌రించార‌ట‌. వాళ్ల‌కు తోక‌లు క‌ట్ చేస్తాన‌ని వార్నింగ్ ఇస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థిత్వాన్ని ఇవ్వ‌న‌ని కూడా మంద‌లించార‌ని తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా ద‌ళిత బంధు ప‌థ‌కంలో క‌మీష‌న్లు తీసుకున్నార‌ని కేసీఆర్ (KCR) హెచ్చ‌రించార‌ట‌. అందుకే, వాళ్ల మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విప‌క్షాల ముక్త‌కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. సుమోటోగా హైకోర్టు నోటీసులు ఇవ్వాల‌ని బీజేపీ కోరుతోంది. ఏసీబీ దాడులు. నిర్వ‌హించాల‌ని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ (యావ‌రేజ్) లీడ‌ర్ (Bakka Jadson) మాత్రం రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరుతున్నారు. ఆ మేర‌కు రాజ్యాంగ సంస్థ‌ల్లోని పెద్ద‌ల‌ను క‌లుస్తూ ఫిర్యాదు చేస్తున్నారు.

Also Read : BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు, జాతీయ రాజకీయాలే లక్ష్యం!