Site icon HashtagU Telugu

Governor:  హనుమాన్ టీంను అభినందించిన తెలంగాణ గవర్నర్

Hanuman

Hanuman

Governor: 2024లో టాలీవుడ్ నుండి వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ హనుమాన్ 25 సెంటర్లలో 100 రోజుల థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సూపర్ హీరో సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది.

నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇవాళ తెలంగాణ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ను కలిసే అవకాశం లభించింది. వీరిద్దరితో గవర్నర్ కొన్ని నిమిషాలు గడిపి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, మన పౌరాణిక సూపర్ హీరోలను సినిమాల్లో శక్తివంతంగా చిత్రీకరించినందుకు వారిని అభినందించారు. వీరిద్దరూ హనుమాన్ విగ్రహాన్ని గవర్నర్ కు బహుమతిగా ఇచ్చారు. వారి సమావేశ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీని సీక్వెల్ జై హనుమాన్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, చాలా మంది పెద్ద స్టార్స్ ఇందులో నటించనున్నారని, ఈ చిత్రాన్ని ఐమాక్స్ 3డిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Exit mobile version