బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) లేఖ (Kavitha Letter) బహిర్గతం కావడం, తర్వాత ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా పార్టీలో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. అయితే ఈ పరిణామాల వేళ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.
1. మీ లేఖను లీక్ చేసిందెవరు?
2. కేసీఆర్ దేవుడైతే… దెయ్యం ఎవరు?
3. కేసీఆర్ పక్కన కోవర్టులు ఎవరు?
4. బీఆర్‌ఎస్‌లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు?
5. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది?
6. మీకు ఫామ్‌హౌస్‌లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు?
7. లేఖ లీక్ కావడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ని అడుగుతారా?
8. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
9. ఇంత జరుగుతుంటే మీ కుటుంబం మీకు ఎందుకు అండగా నిలబడడం లేదు?
10. ఎయిర్‌పోర్టులో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు?
11. మీరు రాసిన లేఖ నకిలీదని మీ సొంత పత్రికలో రాయించింది ఎవరు? అంటూ తన ప్రశ్నలకు కవిత బహిరంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
MEGA157 : సెట్స్ లోకి దిగిన చిరంజీవి..రఫ్ ఆడించడం ఖాయం
తాజాగా అమెరికా పర్యటన పూర్తి చేసుకొని శుక్రవారం కవిత శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తానే ఆ లేఖ రాశానని, గతంలో కూడా తన అభిప్రాయాలను లేఖల రూపంలో కేసీఆర్‌కు చెప్పిన అనుభవం ఉందని తెలిపారు. ఈ లేఖలో వ్యక్తిగత ద్వేషం లేదని, ప్రజల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబించానన్నారు. కేసీఆర్ దేవుడే అయినా, ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ దెయ్యాల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ అంతర్గత పరిస్థితులు చూస్తే, ఇతర నేతల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు.
కవిత కొత్త పార్టీ పెడతారా అనే ప్రశ్నకు ఆమె స్పష్టంగా “అవసరం లేదు” అని అన్నారు. బీఆర్ఎస్‌లో చిన్నచిన్న లోపాలను సరిచేసుకుంటూ, కోవర్టులను పక్కకు నెట్టి, ఒక బలమైన ఆత్మ పరిశీలనతో ముందుకు సాగితే పార్టీ పునరుజ్జీవనం పొందుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు తమ లేఖను రాజకీయ లబ్దికి వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయిందనే ప్రచారానికి తావులేదని, తమ నాయకుడు కేసీఆర్‌నే అని ధీమాగా తెలిపారు