Site icon HashtagU Telugu

Inter results: ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి..

Template (23) Copy

Template (23) Copy

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విచారణ కలిగించే విషయం. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులు లాక్ డౌన్ విధించే సమయానికి పదవ తరగతిలో లో ఉన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లోనే జరిగి పోయాయి.

కరోనా మునుపే మన విద్యావ్యవస్థ లో చాల అసమానతలు, అంతరాలు ఉన్నాయి. ఒక వైపు ఏసీ సౌకర్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటె మరో వైపు కూర్చోడానికి కూడా బల్లాలు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపు 70% ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదని పేర్కొంది. లాక్ డౌన్ లో తినడానికి కూడా తిండి లేక జనం ఉంటె స్మార్ట్ ఫోన్లు ఎలా వస్తాయి అని ప్రభుత్వం అనుకుంటుందో తెలియడం లేదు. విద్యాశాఖ మంత్రి ఇంట్లో పిల్లలకు ఉన్నటు పేద, మధ్య తరగతి ఇంట్లో పిల్లలకు వసతులు ఉండవు గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ ఎలా ఉందొ గమనించాలి. ఒక్క చిన్న గదిలో ఒక కుటుంబం ఉంటుంది ఇంకా చదువుకునే ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది. ఒకవైపు నైపుణ్యం లేని ఉపాధ్యాయులు మరో వైపు పేదరికం.

ఇపుడిపుడే పాఠశాల ముగుంచుకుని కాలేజీలోకి వచ్చిన వీరు నిరాశకు లోనై విద్యను వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాల్య వివాహాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ కారణంగా పేదరికం తీవ్ర స్థాయిలో పెరుగుతుందని యునెస్కోహెచ్చరించింది. ఆర్తిక బలం ఉన్న విథ్యార్థులు ఒక సంవత్సరం వృధా అయిన పర్వాలేదు అనుకుంటారు కానీ పేద కుటుంబాలు ఆర్థికంగా నిలబడలేక విద్యనే వదిలేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయకుండా విద్యాశాఖ విద్యార్థులందరిని పాస్ చేయాలి లేదా వేరే పరిష్కార మార్గం వెతకాలి.

Exit mobile version