తెలంగాణలో ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవ్‌రావు (Jadav Nagorao) ఆత్మహత్య ( Suicide) చేసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. “రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమే” అని పేర్కొన్నారు.
Daak Maharaj Collections : ‘డాకు మహారాజ్’ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణమాఫీ చేయకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆర్థిక కష్టాలలో మునిగిపోతున్నారని కేటీఆర్ అన్నారు. జాదవ్ దేవ్‌రావు కూడా అలంటి బాధితుడే అన్నారు. ఆయనకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానకాలంలో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. రాళ్ల భూములు కావడంతోపాటు వర్షాలు లేని కారణంగా దిగుబడులు సరిగా రాలేదు. దీంతో ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.3.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. రుణం ఇవ్వడానికి బ్యాంకు అధికారులు దేవ్‌రావుకున్న ఐదెకరాల భూమిని మార్టిగేజ్ చేయించుకున్నారు. వాయిదాల పద్ధతిలో ప్రతి 6 నెలలకోసారి రూ.25 వేల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా రెం డు కిస్తీలు చెల్లించలేకపోయా డు. ఒకవైపు పంటలు సరిగా పండకపోవడంతో, మరోవైపు ప్రభుత్వ పంట రుణం మాఫీ చేయకపోవడంతో తీవ్రంగా మదనపడ్డాడు. ఈ సమయంలో బ్యాంకు అధికారులు ఇటీవల గ్రామానికి వెళ్లి తీసుకున్న లోన్ కిస్తీలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఆదిలాబాద్‌లోని బ్యాంకుకు వచ్చి అధికారులను కలిసి కాళ్లావేళ్లా పడి కొంత గడువు ఇవ్వాలని రైతు దేవ్‌రావు వేడుకున్నా, బ్యాంకు వారు వినలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తుండటంతో తాళలేని రైతు దేవ్‌రావు చావే పరిష్కారం భావించి, పురుగుల మందు డబ్బాతో శనివారం స్వయంగా అదే బ్యాంకుకు చేరుకున్నాడు. నేరుగా వెళ్లి బ్యాంకులోనే పురుగుల మందుతాగాడు.
ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేసి ఉంటె దేవ్‌రావు మరణించే వాడు కాదని , పదేళ్లు రాజుగా బతికిన రైతన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతున్నాడని కేటీఆర్ వాపోయారు. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే రైతాంగం భావిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.