CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన ప్రభుత్వ సలహాదారులు, నూతన ఎమ్మెల్సీలు

CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), వేణుగోపాల్ రావు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవిలను, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి […]

Published By: HashtagU Telugu Desk
Mlc And Advicers

Mlc And Advicers

CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), వేణుగోపాల్ రావు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవిలను, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నలుగురిని సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వేం నరేందర్ రెడ్డి సీఎం వ్యవహారాలు, హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్ వ్యవహారాలు, షబ్బీర్ అలీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖ, మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహారిస్తారు.

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు యూనానిమస్‌గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  Last Updated: 23 Jan 2024, 11:20 PM IST